విక్రమ్ తో కలిసి నటించడం నిజంగా నా అదృష్టం : తమన్నా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విక్రమ్ తో కలిసి నటించడం నిజంగా నా అదృష్టం : తమన్నా

  • విక్రమ్ హీరోగా రెడీ అవుతోన్న 'స్కెచ్' 
  • ఆయన జోడీ తమన్నా
  • అంకితభావం కలిగిన గొప్ప నటుడు విక్రమ్ 
  • ఆయన క్రమశిక్షణ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు
తెలుగు .. తమిళ భాషల్లో తమన్నా అగ్రకథానాయికగా వెలుగొందుతోంది. ప్రస్తుతం తమిళంలో ఆమె విక్రమ్ సరసన 'స్కెచ్' సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ, విక్రమ్ పై ప్రశంసలు కురిపించింది. విక్రమ్ గొప్పనటుడనీ .. ఆయనతో చేయడం వలన ఆ విషయం తనకి ప్రత్యక్షంగా తెలిసిందని చెప్పింది.

 విక్రమ్ ఎప్పుడూ విలక్షణమైన పాత్రలనే ఎంచుకుంటాడనీ, ఆ పాత్రలో ఒదిగిపోవడానికి ప్రాణం పెడతాడని అంది. ఎలాంటి వాతావరణంలోనైనా కరెక్ట్ టైమ్ కి షూటింగుకి వచ్చేస్తాడనీ, ఆయన క్రమశిక్షణ చూస్తే ఆశ్చర్యం వేస్తుందని చెప్పింది. ఆయనని అభిమానులు ఎందుకు అంతలా అభిమానిస్తారనే విషయం తనకి అర్థమైందని అంది. అలాంటి విక్రమ్ తో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చింది.     
tamannah

More Telugu News