nani: దీపావళికి 'మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫస్టులుక్

షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా వైవిధ్యభరితమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ, వరుస విజయాలతో నాని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన వేణుశ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా చేస్తున్నాడు. నాని సరసన కథానాయికగా సాయిపల్లవి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. నానికి నేచురల్ స్టార్ అనే బిరుదు వుంది .. ఇక 'ఫిదా'తో సాయిపల్లవి సహజ నటి అనే పేరు తెచ్చుకుంది. అలాంటి ఈ జోడీని తెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. చెరో హిట్ తరువాత చేస్తోన్న ఈ మూవీ, ఈ జంటకి మరో హిట్ ను అందించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హై క్లాస్ అమ్మాయితో ఈ 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చేసే సందడి ఎలా ఉంటుందో చూడాలి మరి.        
Go Back to Shorts
nani
sai pallavi

More Telugu News