అక్టోబ‌ర్ 27న `రోబో 2.0` ఆడియో విడుద‌ల‌

  • దుబాయ్‌లో జ‌రగ‌నున్న వేడుక‌
  • స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఏఆర్ రెహ‌మాన్‌
  • ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌లు
శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్ హీరోగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన `రోబో 2.0` చిత్ర ఆడియో విడుద‌ల తేదీని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 27న ఈ చిత్రం ఆడియో విడుద‌లకానుంది. దుబాయ్‌లోని బుర్జ్ పార్క్‌లో ఈ ఆడియో వేడుక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించిన ప్ర‌చార పోస్ట‌ర్ల‌ను చిత్ర‌యూనిట్ సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి ప్ర‌ధాన పాత్ర‌ల ఫ‌స్ట్‌లుక్‌లు, త్రీడీ వ‌ర్కింగ్ కార్య‌క్ర‌మాల వీడియోలు బ‌య‌టికొచ్చాయి. వీటికి ప్రేక్ష‌కుల నుంచి అపూర్వ స్పంద‌న ల‌భించింది.
Go Back to Shorts
robo
2.0
shankar
ar rahman
music
audio
dubai
akshay kumar

More Telugu News