హైదరాబాదు కూడా ఇంట్లో ఉన్నట్టే ఉంది: శ్రద్ధా కపూర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాదు కూడా ఇంట్లో ఉన్నట్టే ఉంది: శ్రద్ధా కపూర్

  • హైదరాబాదును వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది
  • ఇంటికి వెళ్తున్నందుకు ఆనందంగా ఉంది
  • 'సాహో' తొలి షెడ్యూల్ ముగిసింది
హైదరాబాదులో ఉంటే ఇంట్లో ఉన్నట్టే ఉందని బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ చెబుతోంది. భారీ బడ్జెట్ తో 'రన్ రాజా రన్' డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయింది.

ఈ మేరకు ట్విట్టర్ పోస్టు పెట్టిన శ్రద్ధా కపూర్... 'ముంబయ్‌ వెళ్తున్నాను... అద్భుతమైన టీమ్ తో పని చేయడం ఆనందంగా ఉంది. యూనిట్ ను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది, మరోపక్క ఇంటికి వెళ్తుండడంతో ఆనందంగా ఉంది. హైదరాబాదులో ఉంటే అచ్చం ఇంట్లో ఉంటున్నట్టే ఉంది' అంటూ ట్వీట్ చేసింది.

 కాగా, ముంబై నుంచి వచ్చి తొలిసారి మల్టీ లాంగ్వేజ్ సినిమాలో నటిస్తున్న శ్రద్ధా కపూర్ కు ప్రభాస్ అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడన్న సంగతి తెలిసిందే. చేపలు, పీతలు, చికెన్‌, మటన్, పనీర్‌, పుట్టగొడుగులు.. ఇలా ఒకటా? రెండా? సుమారు 25 ఐటమ్స్ తో ప్రతి రోజూ శ్రద్ధాకు భోజనం వడ్డించారు. అంతే కాకుండా షూటింగులో షాట్ గ్యాప్ లో బోర్‌ కొట్టకుండా ఉండడానికి సెట్‌ లోనే ఆమె కోసం చిన్న గేమింగ్‌ జోన్‌ కూడా ఏర్పాటు చేశారు. దీంతో శ్రద్ధా కపూర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. 
saho
prabhas
shraddha kapoor
1 st schedule
hydranad
mumbai

More Telugu News