భర్తలు బాగుండాలంటే కర్వా చౌత్ చేయక్కర్లేదంటూ ఫన్నీ ట్వీట్ పెట్టిన ట్వింకిల్ ఖన్నా.. సోషల్ మీడియాలో వైరల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భర్తలు బాగుండాలంటే కర్వా చౌత్ చేయక్కర్లేదంటూ ఫన్నీ ట్వీట్ పెట్టిన ట్వింకిల్ ఖన్నా.. సోషల్ మీడియాలో వైరల్

  • భర్తలు ఆరోగ్యంగా ఉండాలంటే భార్యలు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదన్న ట్వింకిల్
  • భర్తలు బాగుండాలంటే ముందుగా వారి జీర్ణప్రక్రియ బాగుండాలి 
  • సోషల్ మీడియాలో ట్వీట్ వైరల్
బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా సోషల్ మీడియాలో ఆసక్తికర ఆలోచనాత్మక ట్వీట్ లతో ఆకట్టుకుంటుంటుంది. తాజాగా ‘కర్వా చౌత్‌’ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె చేసిన ట్వీట్ ఆలోచన రేకెత్తించేలా, నవ్వుతెప్పించేలా ఆసక్తిగా ఉంది. ఉత్తరాది మహిళలు తమ భర్తలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కర్వాచౌత్ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉపవాసం ఆచరించి, చంద్రోదయం తరువాత భర్త ముఖాన్ని జల్లెడ చాటున చూసిన తరువాత కానీ ఎంగిలిపడరు. దీనిపై ట్వింకిల్ వ్యంగ్యంగా ట్వీట్ పెట్టింది.

భర్తలు బాగుండాలంటే ముందుగా వారి జీర్ణప్రక్రియ బాగుండాలని, అలా ఉండాలంటే భార్యలు ఉపవాసం చేస్తే సరిపోదని ట్వింకిల్ చెప్పింది. భూమిమీద ఎక్కువ కాలం బతికే జంతువులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు, వాటి జీర్ణక్రియ బాగుండడమే అందుకు కారణమని తేల్చిచెప్పారని ఆమె గుర్తు చేసింది. అంతేకానీ, వాటి భార్యలు కర్వాచౌత్ ఉపవాసం ఉండడం వల్ల అవి ఎక్కువ కాలం బతికి ఉండలేదని ఆమె చమత్కరించింది.

గతేడాది కర్వాచౌత్ సందర్భంగా కూడా ట్వింకిల్ ఇలాంటి ట్వీటే చేసింది. ‘ఈ కాలంలో 40 ఏళ్లు దాటగానే చాలామంది మగవారు రెండో పెళ్లి చేసేసుకుంటున్నారు. అలాంటివారి కోసం భార్యలు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు’ అంటూ అప్పట్లో ఆమె చేసిన ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, తాజా ట్వీట్ కూడా వైరల్ అయింది. 
twinkile khanna
akshay kumar
twitter
tweet

More Telugu News