సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చే ఆలోచనలో 'భాగమతి'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చే ఆలోచనలో 'భాగమతి'

  •  అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'భాగమతి' 
  •  టైటిల్ రోల్ లో అనుష్క
  •  పోటీ పెద్దగా లేకపోతే సంక్రాంతికి విడుదల       
ఎప్పటిలానే సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాల మధ్య గట్టి పోటీ ఉంటుందనే వార్తలు కొన్ని రోజుల క్రితం వరకూ షికారు చేశాయి. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లోని సినిమా .. బాలకృష్ణ - కె. ఎస్. రవికుమార్ కాంబినేషన్ లోని మూవీ .. కొరటాల శివ - మహేశ్ బాబు చేస్తోన్న సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే షూటింగులో జరుగుతోన్న జాప్యం కారణంగా పవన్ మూవీ ..  ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లడం వలన మహేశ్ సినిమా సంక్రాంతికి రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక అన్నీ అనుకున్నట్టుగా జరిగితేనే బాలకృష్ణ సినిమా అయినా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. సంక్రాంతికి పోటీ తగ్గితే .. ప్రేక్షకుల ముందుకు రావడానికి 'భాగమతి' రెడీగా ఉందట. అనుష్క ప్రధాన పాత్రగా అశోక్ తెరకెక్కించిన ఈ సినిమా, సరైన విడుదల సమయం కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారని సమాచారం.       
anushka

More Telugu News