పెళ్లి తేదీ మ‌ర్చిపోయిన ట్వింకిల్... తెలివిగా జ్ఞాపకం చేసిన అక్ష‌య్.. ఆకట్టుకుంటున్న వాణిజ్య ప్రకటన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి తేదీ మ‌ర్చిపోయిన ట్వింకిల్... తెలివిగా జ్ఞాపకం చేసిన అక్ష‌య్.. ఆకట్టుకుంటున్న వాణిజ్య ప్రకటన!

  • ఆభ‌రణాలు బ‌హుమ‌తిగా ఇచ్చాడు
  • ఓ ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించిన‌ అక్ష‌య్ దంప‌తులు
  • వీడియో షేర్ చేసిన న‌టుడు
బాలీవుడ్ జంట‌ అక్ష‌య్ కుమార్‌, ట్వింకిల్ ఖ‌న్నాల‌ను చూస్తే భార్య‌భ‌ర్త‌లంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. వారి దాంప‌త్య జీవితాన్ని ఓ న‌గ‌ల కంపెనీ త‌మ ప్ర‌క‌ట‌న‌ల కోసం వాడుకుంది. అందులో వారిద్ద‌రినీ చూపించిన తీరుకి నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు. ఈ ప్ర‌క‌ట‌న వీడియోను అక్ష‌య్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో షేర్ చేశాడు.

`ప్రేమ‌కు ప్రైజ్ ట్యాగ్ ఉండ‌దు. కానీ ప్రేమ తెలిపేందుకు కొన్నిసార్లు అది ఉప‌యోగ‌ప‌డుతుంది` అంటూ అక్ష‌య్ పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ట్వింకిల్ త‌మ పెళ్లి జ‌రిగిన తేదీ మ‌ర్చిపోతుంది. `భార్య పెళ్లి తేదీని మ‌ర్చిపోయిందంటే ప్ర‌మాద‌మే!` అంటూ అక్ష‌య్ ఆమెను స‌ర్‌ప్రైజ్ చేయ‌డానికి ఆభ‌ర‌ణాలు కొంటాడు. వాటి ధ‌ర ట్యాగ్ మీద వారి పెళ్లి తేదీ రాసి ఉండ‌టం చూసి ట్వింకిల్ అర్థం చేసుకుంటుంది. ప్ర‌క‌ట‌న కొద్ది సేపే ఉన్నా దానిలో ఎంతో అర్థం ఉంద‌ని, మ‌రోసారి దాంప‌త్య జీవితానికి అక్ష‌య్‌, ట్వింకిల్ ఆద‌ర్శంగా నిలిచార‌ని నెటిజ‌న్లు పొగిడేస్తున్నారు.
twinkle khanna
akshay kumar
advertisement
viral
twitter

More Telugu News