'భరత్ అను నేను' షూటింగ్ నిలిపివేయలేదు .. అవన్నీ రూమర్సే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భరత్ అను నేను' షూటింగ్ నిలిపివేయలేదు .. అవన్నీ రూమర్సే!

  • 'స్పైడర్' రిజల్ట్ విషయంలో మహేశ్ అసహనంగా ఉన్నాడంటూ టాక్
  •  అందువల్లనే 'భరత్ అను నేను' షూటింగ్ నిలిపివేశాడనే  ప్రచారం
  •  ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్న నిర్మాతలు
  •  విదేశాల నుంచి మహేశ్ వచ్చాక షూటింగ్ మొదలు   
మహేశ్ బాబు తదుపరి చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' తెరకెక్కుతోంది. ఒక వైపున ఈ సినిమా షూటింగులో పాల్గొంటూనే మరో వైపున 'స్పైడర్' ప్రమోషన్స్ లో మహేశ్ పాల్గొన్నాడు. ఆ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నప్పటికీ, మహేశ్ రేంజ్ లో లేదనే వార్త షికారు చేస్తోంది. ఈ సినిమా రిజల్ట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అసహనానికి లోనైన మహేశ్, 'భరత్ అను నేను' షూటింగును కూడా నిలిపివేశాడంటూ ప్రచారం జోరందుకుంది.

ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన అసెంబ్లీ సెట్ ను తొలగించడం ఈ ప్రచారానికి మరో కారణంగా చెప్పుకుంటున్నారు. అయితే ఆ సెట్ లో చేయవలసిన షూటింగు పూర్తయింది కనుక, దానిని తొలగించడం జరిగిందనీ, నెక్స్ట్ షెడ్యూల్ కి సంబంధించిన ఏర్పాట్లలో తాము ఉన్నామని నిర్మాతలు చెబుతున్నారు. పక్కా ప్లానింగుతో తమ సినిమా షూటింగ్ జరుగుతోందనీ, అనవసరమైన పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఇదంతా కేవలం పుకారనీ .. ఫ్యామిలీతో మహేశ్ సరదాగా విదేశాల్లో విహరిస్తూ ఉండటమే అందుకు నిదర్శనమనేది అభిమానుల మాట.     
mahesh babu

More Telugu News