బ్రేకింగ్ న్యూస్: డిసెంబర్ లో ప్రభాస్, అనుష్కల ఎంగేజ్ మెంట్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్రేకింగ్ న్యూస్: డిసెంబర్ లో ప్రభాస్, అనుష్కల ఎంగేజ్ మెంట్?

  • ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు
  • వెల్లడించిన ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు
  • వీరిద్దరి క్లోజ్ ఫ్రెండ్ తనకు చెప్పాడంటూ వెల్లడి
హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, అందులో నిజం లేదంటూ వీరిద్దరూ కూడా కొట్టిపారేశారు. ఈ పరిస్థితుల్లో, ఏది నిజమో, ఏది అబద్ధమో అభిమానులకు అంతుబట్టకుండా తయారైంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు వీరిద్దరికి సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ వెల్లడించాడు. వారిద్దరూ డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారని ట్వీట్ చేశాడు. వాళ్లిద్దరూ ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వెల్లడించాడు.

ఈ విషయాన్ని ప్రభాస్, అనుష్కల క్లోజ్ ఫ్రెండ్ తనకు చెప్పాడని... వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, ఒకరి పట్ల మరొకరు చాలా కేర్ తీసుకుంటారని చెప్పాడు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో ప్రభాస్, అనుష్కల్లో ఎవరైనా చెబితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. 
prabhas
anushka

More Telugu News