ప్రేమించానని సన్నిహితంగా గడిపి, తర్వాత ఫేస్ బుక్ లో ఆమెపై దుష్ప్రచారం చేసిన ప్రబుద్ధుడి అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమించానని సన్నిహితంగా గడిపి, తర్వాత ఫేస్ బుక్ లో ఆమెపై దుష్ప్రచారం చేసిన ప్రబుద్ధుడి అరెస్టు

  • ప్రేమించానని సన్నిహితంగా గడిపిన యువకుడు
  • ఉద్యోగ నిమిత్తం ముంబై వెళ్లిపోయిన యువతి
  • అయినా సరే తనతో సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి
  • నిరాకరించడంతో ఫేస్ బుక్ లో యువతిపై దుష్ప్రచారం  
ప్రేమించినంతసేపు అంతులేని ప్రేమ కురిపించే ప్రియులు ఆ తరువాత ఉన్మాదంతో ప్రవర్తిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా, తనని ప్రేమించి, సన్నిహితంగా గడిపిన యువతి ఫోటోలను ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేసి, ఆమెను వేశ్యగా పేర్కొంటూ ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన ఘటన వెలుగు చూసింది.

 ఘటన వివరాల్లోకి వెళ్తే... బెంగళూరులో శొవిక్ భువన్ (22) అనే యువకుడు ఒక ప్రైవేటు కళాశాలలో బీబీఎం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానికంగా ఉంటున్న అసోం యువతితో అతనికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ సన్నిహితంగా గడిపారు.

ఈమధ్యే ఆమె ఉద్యోగ నిమిత్తం ముంబై వెళ్లింది. అప్పటి నుంచి అతనితో మాటామంతీ తగ్గింది. దీంతో భువన్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. తనతో సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేయసాగాడు. ఆమె నిరాకరించడంతో ఆమె నగ్న ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. అందులో ఆమె ఫోన్ నెంబర్ ను రివీల్ చేస్తూ వేశ్యగా పేర్కొన్నాడు.

దీంతో ఆమె ఫోన్ నెంబర్ కు ఫోన్లు వెల్లువెత్తాయి. దీంతో ఆవేదన చెందిన ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లాన్ ప్రకారం బెంగళూరు వెళ్లి, ఆమెతో అతనికి ఫోన్ చేయించిన పోలీసులు, భువన్ అక్కడికి రాగానే అరెస్టు చేశారు. అనంతరం ఆమెకు సంబంధించిన 20 నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు గుర్తించి, వాటిని తీసేయించారు. అతనిని ముంబై తరలించి విచారణ ప్రారంభించారు. 
Bangalore
girl harassed
boy in custody

More Telugu News