భారత్-చైనా దేశాల మధ్య బంధం వర్షాకాలంలో వర్షం లాంటిది: చైనా కాన్సులేట్ జనరల్
- ఈ స్నేహ బంధంపై ఒక్కోసారి మబ్బులు కమ్ముకుంటాయి
- ఒడిదుడుకులెదురైనా శాంతియుతంగా కలిసి పనిచేయాలి
- గమ్యం చేరేవరకు ఒకే పడవలో ప్రయాణించాలి
తమ రెండు దేశాల మధ్య సంబంధాలు అనేక ఒడిదుడుకులకు లోనైనప్పటికీ శాంతియుతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానంగా గత మూడేళ్లలో ఈ సంబంధాలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని డోక్లాం ప్రతిష్టంభనను ఉద్దేశించి పేర్కొన్నారు. భారత్- చైనా- భూటాన్ ట్రైజంక్షన్ వంటి సమస్యలను పక్కనపెట్టి రెండు దేశాలు సహకరించుకోవాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. గమ్యం చేరేవరకు రెండు దేశాలు ఒకే పడవలో ప్రయాణించాలని ఆయన అభిలషించారు.