అందుకే 'భాగమతి' ఆలస్యమవుతోందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అందుకే 'భాగమతి' ఆలస్యమవుతోందట!

  •  'భాగమతి' కోసం అనుష్క ఫ్యాన్స్ ఎదురుచూపులు
  •  ఆడియన్స్ ముందుకు రావడానికి మరింత ఆలస్యం
  •  గ్రాఫిక్స్ విషయంలో నిర్మాతల అసంతృప్తి
  •  క్వాలిటీపై దృష్టి పెట్టిన నిర్మాతలు  
కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలు చేయడంలో అనుష్కకి ఎంతో అనుభవం వుంది. ఎంతటి బరువైన కథనైనా భుజాన వేసుకుని ముందుకు నడిపించడం ఆమె ప్రత్యేకత. అలాంటి అనుష్క 'అరుంధతి' .. 'రుద్రమదేవి' వంటి కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాల తరువాత, 'భాగమతి' సినిమా చేసింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అశోక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమైంది. కారణమేదైనా షూటింగ్ విషయంలో బాగానే జాప్యం జరిగింది. ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా సమయం పడుతుందనేది తాజా సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ పట్ల యూవీ క్రియేషన్స్ వారు సంతృప్తిని వ్యక్తం చేయలేదట. అందువలన వాళ్లు అనుకున్న క్వాలిటీ వచ్చిన తరువాత రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమా కూడా తన కెరియర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని అనుష్క ఆశిస్తోంది.    


anushka

More Telugu News