'స్పైడర్' రికార్డ్ సెట్ చేయడం ఖాయమట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'స్పైడర్' రికార్డ్ సెట్ చేయడం ఖాయమట!

  •  యూఎస్ లో 'స్పైడర్' భారీ స్థాయి రిలీజ్
  •  మహేశ్ మూవీస్ కి అక్కడ క్రేజ్ ఎక్కువ
  •   ప్రీమియర్ షోల ద్వారా కొత్త రికార్డుకి ఛాన్స్
  •  తెలుగు రాష్ట్రాల్లో 'బాహుబలి' ఓపెనింగ్స్ రికార్డును టచ్ చేసే  అవకాశం  
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను 'స్పైడర్' భారీ స్థాయిలో విడుదలవుతోంది. యూఎస్ లో మహేశ్ సినిమాలకి మంచి ఆదరణ ఉంటుంది. అందువలన ఆయన సినిమాలు వసూళ్ల విషయంలో అక్కడ కొత్త రికార్డులను సృష్టిస్తుంటాయి. ఆయన తాజా చిత్రం 'స్పైడర్' ప్రీమియర్ షోల ద్వారానే కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

యూఎస్ లో ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ముందు రోజున ఈ సినిమా ప్రీమియర్ షోలను భారీ స్థాయిలో ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షోల ద్వారానే మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. 'జై లవ కుశ' ప్రీమియర్ షోల ద్వారానే హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది. ఆ రికార్డును అధిగమిస్తూ ఈ సినిమా మిలియన్ మార్క్ ను చేరుకోవడం ఖాయమని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో ఈ సినిమా 'బాహుబలి' రికార్డును టచ్ చేయవచ్చని చెప్పుకుంటున్నారు.      
mahesh babu
rakul

More Telugu News