మా అమ్మతో పాటు భార్య కూడా అలానే తయారైంది: ప్రణతిపై ఎన్టీఆర్
Add ap7am to your home Screen

మా అమ్మతో పాటు భార్య కూడా అలానే తయారైంది: ప్రణతిపై ఎన్టీఆర్

  • నవరత్న హెయిర్ ఆయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎన్టీఆర్
  • నేను తెరపై కనిపిస్తుంటే మా అమ్మ మరెవరినీ చూడదు
  • ఈ మధ్య ప్రణతి కూడా అలానే తయారైందని చెప్పి నవ్వులు పూయించిన ఎన్టీఆర్
  • బిగ్ బాస్-2పై మాట్లాడే సమయం కాదంటూ దాటవేత
ప్రస్తుతం నవరత్న హెయిర్ ఆయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, ఆ బ్రాండ్ ప్రమోషన్ నిమిత్తం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న వేళ, 'బిగ్ బాస్'తో తన ప్రయాణం గురించి కాసేపు మాట్లాడాడు. ఎంతో ఆనందంగా దాదాపు రెండున్నర నెలల పాటు సాగిన సీజన్ వన్ ముగిసిందని చెప్పిన ఎన్టీఆర్ ను 'మీ అమ్మకు బిగ్‌ బాస్ షోలో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు?' అన్న ప్రశ్న ఎదురైంది.

సమాధానం ఇచ్చిన ఎన్టీఆర్, నేను తెరపై కనిపిస్తుంటే, మా అమ్మ చూపు నన్ను దాటి ఎక్కడికీ వెళ్లదు. నా భార్య ప్రణతి కూడా ఇలాగే తయారైంది. నన్ను తప్ప ఎవరినీ చూడదు అని చెప్పి నవ్వులు పూయించాడు. ఈ ఇద్దరు మహిళలూ తన జీవితంలో ఉండటం తనకెంతో అదృష్టమని అన్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 2లోనూ హోస్ట్ గా మీరే ఉంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు దానికి సమాధానం చెప్పే సమయం, సందర్భం ఇది కాదంటూ దాటవేశాడు.
ntr
bigboss
pranati

More Telugu News