mahesh babu: బలమైన ఎమోషన్స్ తో కూడిన స్టైలీష్ మూవీ 'స్పైడర్' : మహేశ్

షార్ట్స్‌లో చూడండి
'స్పైడర్' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, మహేశ్ అభిమానుల్లో అంతకంతకూ ఆసక్తి పెరిగిపోతోంది. ఇక మహేశ్ బాబు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించడం ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నాడు.

 మురుగదాస్ సినిమాలు రెండు రకాలుగా ఉంటాయనీ, 'రమణ' .. 'కత్తి' వంటి ఎమోషన్స్ తో కూడిన సినిమాలు ఒక రకమని చెప్పాడు. ఇక స్టైలీష్ గా వుండే 'గజని' .. ' తుపాకి' వంటి సినిమాలు రెండో రకమని అన్నాడు. 'స్పైడర్' వచ్చేసి రెండవ రకానికి చెందినదనీ .. దీనికి మురుగదాస్ తనదైన శైలిలో ఎమోషన్స్ ను కూడా జోడించాడని మహేశ్ చెప్పాడు. కనుక ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందని అన్నాడు. తన అభిమానులు అన్ని విధాలా సంతృప్తిని వ్యక్తం చేసే సినిమా ఇదని చెప్పుకొచ్చాడు.     
Go Back to Shorts
mahesh babu
rakul

More Telugu News