'సాహో'లో పోలీస్ ఆఫీసర్ గా శ్రద్ధా కపూర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో'లో పోలీస్ ఆఫీసర్ గా శ్రద్ధా కపూర్

  •  జోరుగా సాగుతోన్న 'సాహో' షూటింగ్
  •  శ్రద్ధా కపూర్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్
  •  పోలీస్ ఆఫీసర్ గా భారీ ఫైట్స్
  •  తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో నిర్మాణం    
ప్రభాస్ .. సుజీత్ కాంబినేషన్లో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర డిఫరెంట్ షేడ్స్ ను కలిగి వుంటుందనే వార్త ఒకటి ఇటీవల బయటికి వచ్చింది. ఒక షేడ్ లో సంప్రదాయ బద్ధంగా .. మరో షేడ్ లో ఫైటింగులు చేసేదానిలా కనిపిస్తుందని చెప్పుకున్నారు.

 ఇందుకోసం ఆమె హాలీవుడ్ స్టంట్ మాస్టర్ శిక్షణలో ఫైట్స్ నేర్చుకుంటుందనే వార్త కూడా షికారు చేస్తోంది. దాంతో ఆమె అంతలా ఫైట్స్ ఎందుకు చేయాల్సి వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో తలెత్తింది. ఆ డౌట్ క్లియర్ చేయడం కోసమేనన్నట్టుగా, తాను ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తానంటూ శ్రద్ధా కపూర్ చెప్పేసింది. ప్రభాస్ జోడీగా బహుభాషా చిత్రంలో నటించే ఛాన్స్ రావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసింది.
prabhas
shraddha kapoor

More Telugu News