పొరపాటున తప్పుడు సమాచారం ఇచ్చాం... హనీప్రీత్ మా దేశంలో లేదు: తేల్చి చెప్పిన నేపాల్ సీబీఐ
- ఆమెను చూసినట్టు కొందరు చెప్పారు
- అదే విషయాన్ని ఇండియాకు వెల్లడించాం
- కానీ ఆమె ఆచూకీ లభించలేదు
- నేపాల్ సీబీఐ డైరెక్టర్ స్పష్టీకరణ
"కొంతమంది భీరత్ నగర్ పరిసరాల్లో ఆమెను చూసినట్టు సమాచారం ఇచ్చారు. మరికొందరు పశ్చిమ నేపాల్ లో చూసినట్టు తెలిపారు. ఖాట్మండులో కనిపించినట్టూ వార్తలు వచ్చాయి. ఇదే సమాచారాన్ని ఇండియాకు మేము పంచుకున్నాం. కానీ, ఈ వార్తలన్నీ తప్పు" అని ఆయన అన్నారు. చిన్న పొరపాటు కారణంగానే ఇలా జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. ఇప్పటికీ హనీప్రీత్ తమ దేశంలో ఉందేమోనని విచారణ జరుపుతున్నామని అన్నారు.
కాగా, ఆమె రాజస్థాన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చినప్పటికీ, ఈ విషయంలో పోలీసుల వద్ద స్పష్టమైన సమాచారం లేకపోవడం గమనార్హం. ఈ నెల 18న హర్యానా పోలీసులు హనీప్రీత్ సహా 43 మంది పేర్లతో వాంటెడ్ లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.