ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ కాదంటూ కొత్త బిరుదు ఇచ్చిన శ్రద్ధా కపూర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ కాదంటూ కొత్త బిరుదు ఇచ్చిన శ్రద్ధా కపూర్!

  • ప్రభాస్ ఇంత వరకు నటించిన అన్ని సినిమాలు చూసేశాను
  • ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ కాదు, ద న్యూ బ్లాక్ బస్టర్ కింగ్
  • ప్రభాస్ ఆతిథ్యం అదుర్స్


ప్రభాస్ నటన గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా టాలీవుడ్ లో ప్రవేశించిన ప్రభాస్ ఇప్పటి వరకు 16 సినిమాలు చేశాడన్న సంగతి తెలిసిందే. తాజాగా 'సాహో' షూటింగ్ తో బిజీగా ఉన్నాడీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్, ప్రభాస్ గురించి ఒక్కో విశేషం చెబుతూ ఆసక్తి పెంచుతోంది. తొలుత ప్రభాస్ ఆతిథ్యం గురించి చెప్పిన శ్రద్ధా, తాజాగా ప్రభాస్ కు కొత్త బిరుదు కూడా ఇచ్చింది.

షూటింగ్ సందర్భంగా యూనిట్ తో మాట్లాడుతూ, ప్రభాస్ నటించిన అన్ని సినిమాలను చూసేశానని చెప్పింది. ప్రభాస్ నటన గురించి తెలుసుకునేందుకే అతని సినిమాలు చూశానని అంది. ప్రభాస్ ను అంతా యంగ్ రెబల్ స్టార్ అంటారని, కానీ ప్రభాస్ ను అలా కాకుండా ‘ద న్యూ బ్లాక్‌ బస్టర్‌ కింగ్‌’ అని పేర్కొంది. 
prabhas
shraddha
sahoo

More Telugu News