రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న తమిళ యువహీరోలు జై, ప్రేమ్‌జీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న తమిళ యువహీరోలు జై, ప్రేమ్‌జీ

తమిళ యువ నటులు జై, ప్రేమ్‌జీలు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. చెన్నైలో వారు ప్రయాణిస్తున్న 'ఆడి' కారు  అడయార్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఆ సమయంలో కారును జై డ్రైవ్ చేస్తున్నాడు. బ్రిడ్జి గోడను ఢీకొట్టిన కారు కొంతదూరం ప్రయాణించి ఆగిపోయింది. ఈ ప్రమాదం నుంచి నటులు ఇద్దరు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న శాస్త్రినగర్ పోలీసులు 'జై'  తాగి కారును నడిపినట్టు గుర్తించారు. అయితే ఈ ఆరోపణలను ప్రేమ్‌జీ కొట్టిపడేశాడు. అది చాలా చిన్న ప్రమాదమని, తాను, జై క్షేమంగానే ఉన్నట్టు తెలిపాడు. జై నటించిన ‘బెలూన్’ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకు శైనిష్ దర్శకత్వం వహించాడు.
Actors
Jai
Premgi
kollywood

More Telugu News