తమిళ 'స్పైడర్' కోసం పక్కా ప్లానింగ్ తో మహేశ్ బాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ 'స్పైడర్' కోసం పక్కా ప్లానింగ్ తో మహేశ్ బాబు!

  •  తెలుగు .. తమిళ భాషల్లో ఒకే రోజున 'స్పైడర్'రిలీజ్
  •  పక్కా ప్లానింగ్ తో తమిళ 'స్పైడర్' ప్రమోషన్స్
  •  తెలుగుతో పాటు తమిళంలో హిట్ కొట్టాలనే ఆలోచనలో  మహేశ్
  •  అక్కడి హీరోల్లోను ఈ సినిమా పట్ల ఆసక్తి         
మహేశ్ బాబు .. మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన 'స్పైడర్' చిత్రం, తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమిళ వెర్షన్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొనడానికి మహేశ్ రెడీ అవుతున్నాడట. ఇందుకోసం ఆయన పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని అంటున్నారు.

 ఆ ప్లాన్ ప్రకారం తమిళ టీవీ చానల్స్ కి వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం .. అక్కడి టీవీ గేమ్ షోస్ లో పాల్గొనడం .. ప్రముఖ దిన పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తాడట. చాలా చురుకుగా .. చకచకా ఈ పనులను పూర్తి చేసేలా ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నారట. ఈ మూవీ పట్ల అక్కడి హీరోలు సైతం ఆసక్తిని చూపుతుండటం విశేషం. తమిళంలో మహేష్ కి ఇది ఫస్టు మూవీ కనుక, తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి మరి.   
mahesh babu
rakul

More Telugu News