ntr: మూడు పాత్రల్లోను ఎన్టీఆర్ దుమ్మురేపేశాడట!

షార్ట్స్‌లో చూడండి
భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో రూపొందిన 'జై లవ కుశ' సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎన్టీఆర్ నటన అదుర్స్ అనేస్తున్నారు. ఈ సినిమాకి ప్రధానమైన బలం .. ప్రత్యేకమైన ఆకర్షణ ఆయనేనని అంటున్నారు. జై .. లవ .. కుశ ఈ మూడు భిన్నమైన పాత్రలనీ, దాంతో ప్రతి పాత్రకు మధ్య గల తేడా స్పష్టంగా తెలిసేలా ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని చెబుతున్నారు.

మూడు పాత్రలు ఒకేసారి ఒకేలా కనిపించే సందర్భాల్లోను, ఆ వేషధారణలో ఎవరు ఏమిటనే వైవిధ్యాన్ని నటనతోనే తెలిసేలా ఆయన ఆ సన్నివేశాలను పండించారని అంటున్నారు. పాత్రలకి తగినట్టుగా వేషధారణ .. మాట తీరు .. బాడీ లాంగ్వేజ్ లో ఆయన చూపిన వైవిధ్యం ఆశ్చర్యపరుస్తుందని చెబుతున్నారు. ఇది ఎన్టీఆర్ మాత్రమే చేయదగిన సినిమా అనీ .. ఆయన కనుకనే అంత బాగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ మూడు పాత్రలకి కలిపి నూటికి నూరు మార్కులు కొట్టేశాడన్న మాట.        
Go Back to Shorts
ntr
rakul

More Telugu News