ఎన్నారై టాక్... 'జై లవకుశ'లో అదిరిపోయే సీన్స్ ఇవే!
Add ap7am to your home Screen

ఎన్నారై టాక్... 'జై లవకుశ'లో అదిరిపోయే సీన్స్ ఇవే!

  • ఒకరోజు ముందే యూఎస్ లో విడుదల
  • ప్రీమియర్ షోలు చూసి సోషల్ మీడియాలో కామెంట్లు
  • చిత్రం బాగుందని ప్రశంసలు
నేడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల కానున్న ఎన్టీఆర్ త్రిపాత్రాభినయ చిత్రం 'జై లవకుశ' అమెరికాలో ఒకరోజు ముందుగానే విడుదల కాగా, ప్రీమియర్ షోలను చూసిన ప్రవాస భారతీయులు, చిత్రం ఎలా ఉందో సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. రొటీన్ గా ఉన్న రివెంజ్ డ్రామానే అయినా, ఎన్టీఆర్ అన్నీ తానై చిత్రాన్ని నడిపించాడని కితాబులు అందుతున్నాయి. ముగ్గురు ఎన్టీఆర్ లూ అన్నదమ్ములు కాగా, వారి తండ్రిగా పోసాని కృష్ణ మురళి నటించాడని, తొలి సగ భాగం మొత్తం లవ, కుశలకు సంబంధించిన సరదా సీన్స్ సాగుతాయని, ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతమని అభిమానులు చెబుతున్నారు.

'కుశ' క్యారెక్టర్ కామెడీని పండించిందని, ముఖ్యంగా బ్యాంకులో సాగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయని, 'జై' ప్రవేశంతో కథ మలుపు తిరుగుతుందని, అక్కడి నుంచి వేగంగా కథ సాగిపోతుందని అంటున్నారు. ముగ్గురు ఎన్టీఆర్ లూ కలసి నటించిన ఓ నాటకం సీన్ సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. తమన్నా ఐటమ్ సాంగ్ సినిమాకు ప్లస్ పాయింట్ అని, అన్ని వర్గాల వారినీ అలరించే చిత్రమిదని అంటున్నారు.
jai lavakusa
NTR

More Telugu News