'సాహో' తరువాత ప్రభాస్ చేసేది లవ్ స్టోరీనే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' తరువాత ప్రభాస్ చేసేది లవ్ స్టోరీనే!

  • 'సాహో' షూటింగులో బిజీగా ప్రభాస్
  •  తదుపరి సినిమా రాధాకృష్ణ కుమార్ తో
  •  యూరప్ నేపథ్యంలో కొనసాగే లవ్ స్టోరీ  
ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి ఆలస్యంగా వెళ్లడంతో, ఇక షెడ్యూల్స్ పరంగా లేట్ కాకుండా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు మేజర్ షెడ్యూల్స్ విదేశాల్లోనే జరగనున్నాయి. తదుపరి సినిమాను మొదలుపెట్టడానికి ప్రభాస్ పెద్ద గ్యాప్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.

ఆయన తన తదుపరి సినిమాను 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్లాన్ చేశాడు. ఇది ఒక అసలుసిసలైన లవ్ స్టోరీ అని సమాచారం. ఈ ప్రేమకథ యూరప్ నేపథ్యంలో కొనసాగనుంది. అందువలన చిత్రీకరణ అంతా కూడా యూరప్ లోనే. 1960 -70 మధ్య కాలంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ 'అమిత్ త్రివేది' ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నట్టు తెలుస్తోంది. కథానాయిక ఎవరనే విషయంతో పాటు ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.   
prabhas

More Telugu News