అది పుకారు మాత్రమే .. అందులో నిజం లేదు : ఎన్టీఆర్
Add ap7am to your home Screen

అది పుకారు మాత్రమే .. అందులో నిజం లేదు : ఎన్టీఆర్

  • బాబీని పక్కన పెట్టేశారనే వార్తలపై స్పందించిన ఎన్టీఆర్
  •  కథకి సంబంధించి కొన్ని సలహాలు మాత్రమే ఇచ్చాను
  •  దర్శకత్వంలో జోక్యం చేసుకోలేదు
  •  హిట్ అయితే ఆ క్రెడిట్ బాబీ ఖాతాలోకే  
'జై లవ కుశ' సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ తీరికలేకుండా వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకి బాబీ దర్శకుడు అనే పేరే గానీ .. అంతా ఎన్టీఆరే చూసుకున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. బాబీని పక్కన పెట్టేశారనీ, కెమెరా వెనుక కూడా ఎన్టీఆర్ కీలకమైన పాత్రను పోషించాడని అంటున్నారు.

ఇదే విషయాన్ని ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావిస్తే ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఈ సినిమాకి తాను దర్శకత్వం చేస్తే తన పేరునే వేసుకునేవాడిననీ .. అలా చేస్తే తనని ఎవరు అడుగుతారంటూ ప్రశ్నించారు. కథ విషయంలో .. ఇది ఇలా వుంటే బాగుంటుంది కదా అంటూ కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది గానీ, దర్శకత్వం జోలికి తాను వెళ్లలేదని ఎన్టీఆర్ చెప్పారు. అంతా బాబీనే చూసుకున్నాడనీ .. సినిమా హిట్ అయితే దర్శకుడిగా ఆ క్రెడిట్ దక్కేది ఆయనకేనని స్పష్టం చేశారు.      
ntr
rasi khanna

More Telugu News