సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • అదృష్టం అందలం ఎక్కించిందంటున్న స్వీటీ 
  • మహేశ్, కొరటాల సినిమా కోసం కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • సెన్సార్ పూర్తి చేసుకున్న 'గల్ఫ్'
  • 'సాహో'లో మలయాళ నటుడు లాల్
*  తానీవేళ ఈ స్థాయిలో ఉండడానికి కారణం కేవలం అదృష్టమే అంటోంది కథానాయిక అనుష్క. "సినిమాలలో ఎవరికీ రానన్ని అవకాశాలు నాకు వచ్చాయి. అంటే నా పక్కన అదృష్టం వుంది. వాటిని నేను సద్వినియోగం చేసుకున్నాను. అలాగని నేను కష్టపడడం మాత్రం మానలేదు. ప్రతి సినిమాకి నా కష్టం నేను పడ్డాను. అందుకే ఈ స్థాయికి చేరుకోగలిగాను" అని చెప్పింది అనుష్క.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'భరత్ అను నేను' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు, అన్నపూర్ణా స్టూడియోలో జరుగుతోంది. మహేశ్ తో పాటుగా ప్రధాన తారాగణమంతా ఈ షూటింగులో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.
*  సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన 'గల్ఫ్' చిత్రం సెన్సార్ పూర్తయింది. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే భారతీయులు ఎటువంటి కష్టాలను ఎదుర్కుంటున్నారన్న కథతో రూపొందిన ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేస్తారు.
*  ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు లాల్ (మోహన్ లాల్ కాదు) కీలక పాత్రకు ఎంపికయ్యాడు. గతంలో లాల్ తెలుగులో 'అన్నవరం', 'ఖతర్నాక్' చిత్రాలలో నటించాడు. 
Anushka
prabhas

More Telugu News