సడెన్‌గా బికినీ ధరించడం భారతీయ సంస్కృతికి విరుద్ధమా?: నటి తాప్సీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సడెన్‌గా బికినీ ధరించడం భారతీయ సంస్కృతికి విరుద్ధమా?: నటి తాప్సీ

  • మరోమారు సంచలన వ్యాఖ్యలు
  • అప్పుడు ధరిస్తే ఆరాధించారు.. ఇప్పుడేమో తిట్టిపోస్తున్నారు
  • ఆవేదన వ్యక్తం చేసిన టాలీవుడ్ నటి
సినీ నటి తాప్సీ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసింది.  బికినీ ధరించి బీచ్‌లో తీసుకున్న రెండు ఫొటోలను ఇటీవల తాప్సీ సోషల్  మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలపై నెటిజన్లు మండిపడ్డారు. టు-పీస్ బికినీ ధరించడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని తిట్టిపోశారు. దీంతో స్పందించిన తాప్సీ.. తాను బికినీ ధరించడం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం ఎలా అవుతుందని ప్రశ్నించింది. మహిళల సొంత అభిప్రాయాలను ప్రజలు ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు.. అనే విషయాలను భారతీయ మహిళలకు పుట్టినప్పటి నుంచే నేర్పిస్తున్నారని పేర్కొంది. అప్పటి వరకు సంప్రదాయ దుస్తులు ధరించి, సడెన్‌గా బికినీ ధరించగానే సంస్కృతికి వ్యతిరేకం ఎలా అవుతుందని నిలదీసింది.

‘‘నేను భారతీయురాలినైనందుకు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరిస్తున్నందుకు సిగ్గుపడడం లేదు. అప్పట్లో కూడా మహిళలు కురచ దుస్తులు ధరించారు. చాలా చిన్న జాకెట్లు, బికినీ బ్లౌజులు ధరించేవారు. అయినా వారిని అప్పుడు ఆరాధించారు. ఇప్పుడు నేను ధరిస్తే సరికాదని అంటున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘బికినీ ధరించడానికి శరీరం అనువుగా ఉంటే ఆ విషయంలో ఇక ఆలోచించాల్సిన పనిలేదు. అందులో తప్పేముంది?’’ అని తాప్సీ ప్రశ్నించింది. హీరోయిన్లు లోదుస్తులు (లింగరీ) ధరించి తెరపై కనిపించకపోవడం తనకు ఇప్పటికీ ఆశ్చరంగా ఉంటుందని తాప్సీ పేర్కొంది. తానైతే లింగరీ ధరించడాన్ని ఇష్టపడతానని పేర్కొంది. వాటిని ధరించినప్పుడు ఆ రోజంతా తనలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందని తాప్సీ సెలవిచ్చింది.
Actress
Taapsee Pannu
two-piece
bikini
Indian culture

More Telugu News