మళ్లీ ఎన్టీఆర్ .. మహేశ్ మధ్య బాక్సాఫీస్ పోటీ!
Add ap7am to your home Screen

మళ్లీ ఎన్టీఆర్ .. మహేశ్ మధ్య బాక్సాఫీస్ పోటీ!

   

  •  దసరా బరిలోకి ఎన్టీఆర్ .. మహేశ్
  •  గతంలోను మూడు సార్లు పోటీ పడ్డారు 
  •  ఒక్కోసారి ఒకరికి హిట్ దక్కింది 
  •  ఈ సారి మరింతగా పెరిగిన అభిమానుల్లో ఆసక్తి  


ఎన్టీఆర్ 'జై లవ కుశ' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మహేష్ బాబు 'స్పైడర్' ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దాంతో ఇద్దరి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడే కాదు గతంలోనూ ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర మూడుసార్లు పోటీపడ్డారు.

 ఎన్టీఆర్ 'నాగ' .. 'బృదావనం' .. 'ఊసరవెల్లి' సినిమాలు థియేటర్స్ కి వచ్చినప్పుడే, మహేశ్ బాబు కూడా 'ఒక్కడు' .. 'ఖలేజా' .. 'దూకుడు' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక్కోసారి ఒకరికి విజయం లభించింది. ఇక ఈ సారి ఈ ఇద్దరూ వారం రోజుల తేడాతో థియేటర్స్ కి వస్తున్నారు. రెండూ భారీ సినిమాలే .. రెండూ వైవిధ్యభరితమైనవే కావడం వలన, ఈ సారి ఇద్దరికీ బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
ntr
mahesh

More Telugu News