పీటర్ హెయిన్స్ అలా గట్టిగా అరవగానే చాలా భయం వేసింది: హీరో మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పీటర్ హెయిన్స్ అలా గట్టిగా అరవగానే చాలా భయం వేసింది: హీరో మహేశ్ బాబు

  • స్పైడర్ షూటింగ్ లో జరిగిన ఘటనను గుర్తు చేసుకున్న ప్రిన్స్
  • తీవ్ర జ్వరంతో బాధపడుతూ షూటింగ్ కు వచ్చిన పీటర్
  • రిహార్సల్స్ చూస్తూ కేకలు పెట్టిన ఫైట్ మాస్టర్
  • ఫైట్స్ కోసం ఎంతో కష్టపడ్డారని కితాబిచ్చిన మహేష్
గత రాత్రి అట్టహాసంగా జరిగిన 'స్పైడర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ గురించి మాట్లాడిన హీరో మహేష్ బాబు, ఆయన చూపించిన అంకితభావంపై ప్రశంసల వర్షం కురిపించాడు. షూటింగ్ జరుగుతుండగా జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకున్నాడు.

"ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ అయినట్టుగా నాకు ఫోన్ వచ్చింది. ఎందుకని అడిగితే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ కు జ్వరం వచ్చిందని చెప్పారు. ఆపై మరో రెండు రోజుల తరువాత ఆయన షూటింగ్ కు వచ్చాడు. అప్పుడు పీటర్ ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు. ఏ మాత్రం అరుపులు, కేకలు పెట్టకుండా, మానిటర్ వెనుక మాత్రమే కూర్చుని సన్నివేశాలు చిత్రీకరించుకోవాలని, డాక్టర్ సజస్ట్ చేశారు. ఆయన చెప్పినట్టుగా మేము రిహార్సల్స్ చేస్తున్నాం. రెండు మూడు సార్లు రిహార్సల్స్ అయిన తరువాత, పీటర్ హెయిన్స్ లేచి పెద్దగా 'ఏంటీ లాగుతున్నారు?' అని గట్టిగా అరిచాడు. ఆయనలా కేక పెట్టగానే మాకు భయం వేసింది. ఈ సినిమా కోసం పీటర్ హెయిన్స్ ఎంతో కష్టపడి పనిచేశారు. ఆయన శ్రమ సినిమా చూసే వారికి తెలుస్తుంది" అన్నాడు.
peter heins
mahesh babu
spyder

More Telugu News