puri: ఆలోచనలో పడిన పూరీ జగన్నాథ్?

షార్ట్స్‌లో చూడండి
పూరి జగన్నాథ్ ఎప్పటికప్పుడు చక చకా కథలను అల్లేసి .. అంతే వేగంగా ఆ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఆయనని టాప్ డైరెక్టర్ ను చేసినా, ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వస్తోన్న సినిమాలు అభిమానులను నిరాశ పరుస్తున్నాయి. హీరోల ఖాతాల్లోకి ఫ్లాపులు వెళుతున్నాయి. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ మూవీ తనయుడు ఆకాశ్ పూరితో చేస్తున్నట్టుగా చెప్పాడు. అందుకు సంబంధించిన కాస్టింగ్ కాల్ కూడా వచ్చింది.

 అయితే ముందుగా ఏ హీరోతోనైనా ఒక హిట్ కొట్టమనీ, ఆ తరువాత సినిమా ఆకాశ్ తో చేయడం మంచిదని సన్నిహితులు చెబుతున్నారట. లేదంటే ఆకాశ్ ఫస్టు మూవీపై ఆ ప్రభావం పడొచ్చునని అంటున్నారట. దాంతో పూరీ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. మరి ఆయన నెక్స్ట్ మూవీ వేరే హీరోతో ఉంటుందా? ఆకాశ్ తోనే ముందుకు వెళతాడా? అనేది వేచి చూడాలి.   
Go Back to Shorts
puri
akash

More Telugu News