అదరగొట్టేస్తోన్న 'స్పైడర్' ట్రైలర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదరగొట్టేస్తోన్న 'స్పైడర్' ట్రైలర్!

'స్పైడర్' రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఆత్రుత పెరిగిపోతోంది. వాళ్లలో మరింత ఆసక్తిని పెంచడం కోసం తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ వదిలిన ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

సినిమా కోసం చేసిన భారీ ఖర్చు తెరపై కనిపిస్తుందని మురుగదాస్ చెప్పిన మాట నిజమేననిపించేలా, ప్రతి ఫ్రేమ్ లోను రిచ్ నెస్ కనిపిస్తోంది. సాంగ్స్ ను డిజైన్ చేసిన తీరు కూడా కొత్తగా అనిపిస్తోంది. డైలాగ్స్ చాలా సహజంగా అనిపిస్తున్నాయి. మహేశ్ బాబు మరింత హ్యాండ్సమ్ గా .. స్పెట్స్ పెట్టుకుని రకుల్ కొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం హైదరాబాదు, మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో జరగనుంది. ఈ నెల 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
  
mahesh babu
rakul

More Telugu News