'జై లవ కుశ'ల తరువాత స్థానంలో సాయికుమార్ పాత్ర!
Add ap7am to your home Screen

'జై లవ కుశ'ల తరువాత స్థానంలో సాయికుమార్ పాత్ర!

ఎన్టీఆర్ హీరోగా కల్యాణ్ రామ్ నిర్మాణంలో 'జై లవకుశ' తెరకెక్కింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ జై .. లవ .. కుశ .. అనే మూడు పాత్రలను పోషించాడు. కథానాయికలుగా రాశి ఖన్నా .. నివేదా థామస్ కనువిందు చేయనున్నారు. ఇక మిగిలిన పాత్రల్లోను క్రేజ్ వున్న నటీనటులు కనిపించనున్నారు.

 అయితే 'జై .. లవ .. కుశ' పాత్రల తరువాత అధిక ప్రాధాన్యత కలిగిన పాత్ర ఎవరిదంటే సాయికుమార్ దేనని చెబుతున్నారు. ఈ సినిమాలో ఆయన 'జై ' పాత్రకి రైట్ హ్యాండ్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాడట. ఈ పాత్ర గురించి వినగానే .. సాయికుమార్ అయితేనే సరైన న్యాయం జరుగుతుందని ఎన్టీఆర్ చెప్పడంతో ఆయనను తీసుకున్నారట. అనుకున్నట్టుగానే ఆయన ఈ పాత్రకి జీవం పోశాడని అంటున్నారు. ఈ నెల 21వ తేదీన థియేటర్స్ కి వస్తోన్న ఈ సినిమా, సాయికుమార్ కి మరింత క్రేజ్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.      
ntr
rasi khanna

More Telugu News