'సాహో' మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన శ్రద్ధా కపూర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన శ్రద్ధా కపూర్!

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో శ్రద్ధా కపూర్ జాయిన్ అయింది. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తుందంటూ కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఒక పాత్ర కాస్త అమాయకంగా కనిపించేదైతే .. మరొకటి ఐ డోంట్ కేర్ అనే టైపులో కొనసాగే పాత్రని చెప్పుకున్నారు.

తాజాగా ఈ విషయంపై శ్రద్ధా కపూర్ స్పందించింది. ఈ సినిమాలో తాను డ్యూయెల్ రోల్ చేస్తున్నానంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పింది. ప్రభాస్ సరసన తాను చేసేది ఒకటే రోల్ అని స్పష్టం చేసింది. షూటింగులోనే తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది. ప్రభాస్ సరసన ఛాన్స్ రావడం ఒక అదృష్టమైతే .. బహుభాషా చిత్రంలో అవకాశం దక్కడం మరో అదృష్టమని అంది. ఈ సినిమాలో తన పాత్ర పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది.  
prabhas
shraddha kapoor

More Telugu News