'జై లవ కుశ' కోసం దిల్ రాజు 28 కోట్లు పెట్టేశాడు!
Add ap7am to your home Screen

'జై లవ కుశ' కోసం దిల్ రాజు 28 కోట్లు పెట్టేశాడు!

'జై లవ కుశ'లో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించాడు. ఇదే ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ కానుంది. ఈ కారణంగా ఇండస్ట్రీ వర్గాల్లోను .. అభిమానుల్లోను ఆసక్తి పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన నైజామ్ హక్కులను దిల్ రాజు దక్కించుకున్నారు. ఇందుకోసం ఆయన 20 కోట్లను చెల్లించినట్టు సమాచారం.

ఇక వైజాగ్ హక్కులను కూడా 8 కోట్లకు ఆయనే సొంతం చేసుకున్నారు. ఇలా ఈ సినిమాపై ఆయన 28 కోట్ల వరకూ పెట్టేశారు. ఈ నెల 21వ తేదీన విడుదలవుతోన్న ఈ సినిమా, ఈ రెండు ప్రాంతాల్లో దిల్ రాజుకి ఏ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతుందో చూడాలి. కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. రాశి ఖన్నా .. నివేదా థామస్ కథానాయికలుగా అలరించనున్నారు.     
ntr
rasi khanna

More Telugu News