సన్ టీవీ చేతికి 'స్పైడర్' తమిళ శాటిలైట్ హక్కులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సన్ టీవీ చేతికి 'స్పైడర్' తమిళ శాటిలైట్ హక్కులు!

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' ప్రపంచవ్యాప్తంగా తెలుగు .. తమిళ భాషల్లో రూపొందింది. తెలుగుతో పాటు తమిళ వెర్షన్ కి సంబంధించిన బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. తమిళ శాటిలైట్ హక్కులను సన్ టీవీ వారు సొంతం చేసుకున్నారనేది తాజా సమాచారం. ఇందుకోసం వాళ్లు ఎంత చెల్లించారనేది తెలియదుగానీ, భారీ మొత్తానికే ఈ రైట్స్ అమ్ముడైనట్టు చెబుతున్నారు.

 ఈ నెల 9వ తేదీన చెన్నైలో భారీస్థాయిలో ఆడియో రిలీజ్ వేడుక జరిపిన ఈ సినిమా టీమ్, హైదరాబాద్ శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఈ వేడుకను నిర్వహిస్తారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, మలయాళ .. హిందీ .. అరబిక్ భాషల్లోను విడుదల చేయనున్నారు.  
mahesh babu
rakul

More Telugu News