'లై' మూవీ భారీ నష్టానికి కారణాలివే!
స్టైలిష్ మేకింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా, కథా కథనాల విషయంలో బలహీనపడిపోయింది. ఒక్క యూత్ నే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మాస్ ను థియేటర్స్ కి రప్పించలేకపోయింది. ఇక 'నేనే రాజు నేనే మంత్రి' .. 'జయ జానకి నాయక' వంటి భారీ అంచనాలతో వచ్చిన సినిమాలతో పోటీపడింది. ఇవన్నీ కూడా ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోవడానికీ .. అతి తక్కువ వసూళ్లను రాబట్టడానికి కారణాలయ్యాయని ట్రేడ్ వర్గాల కథనం.