మురుగదాస్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మురుగదాస్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట!

మహేశ్ బాబు కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించిన 'స్పైడర్' సినిమాలో, విలన్ గా ఎస్.జె.సూర్య చేసిన సంగతి తెలిసిందే. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. తెలుగుతో పాటు తమిళంలోను మహేశ్ బాబు తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అలాగే ఎస్. జె. సూర్య కూడా తమిళంతో పాటు తెలుగులోను తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. డిఫరెంట్ గా ఉంటుందని మురుగదాసే చెప్పమన్నాడట.

 అయితే తెలుగులో ఆయన డైలాగ్స్ లో తమిళ యాస స్పష్టంగా తెలుస్తుందనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారట. ఇక ఇటీవల టీజర్ చూసిన వాళ్ల నుంచి కూడా అదే టాక్ రావడంతో, మురుగ దాస్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. డబ్బింగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ తో, ఎస్. జె. సూర్య పాత్రకి డబ్బింగ్ చెప్పించాడట. 
mahesh babu
rakul

More Telugu News