ఎన్టీఆర్ కథానాయకుడిగా 'శ్రీనివాస కల్యాణం'?
Add ap7am to your home Screen

ఎన్టీఆర్ కథానాయకుడిగా 'శ్రీనివాస కల్యాణం'?

దిల్ రాజు నిర్మాతగా .. రచయిత సతీశ్ వేగేశ్న దర్శకుడిగా తెరకెక్కిన 'శతమానం భవతి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం మరో సినిమా చేయాలని ఈ ఇద్దరూ అప్పుడే అనుకున్నారు. ఆ తరువాత సతీశ్ వేగేశ్న కథను రెడీ చేయడం .. దానికి 'శ్రీనివాస కల్యాణం' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగిపోయాయి. అయితే ఈ కథను ఏ హీరోతో చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తూ వచ్చారు.

 ఈ కథకి ఎన్టీఆర్ కరెక్ట్ అని తేల్చేసిన దిల్ రాజు .. తాజాగా ఈ కథను ఎన్టీఆర్ కి వినిపించాడట. కథ బాగా నచ్చేసిందన్న ఎన్టీఆర్, వెంటనే డేట్స్ ఇవ్వలేనని చెప్పాడని సమాచారం. త్రివిక్రమ్ ప్రాజెక్టు పూర్తయిన తరువాత చేద్దామంటే ఓకే అన్నాడట. అందుకు దిల్ రాజు ఓకే చెప్పాడని అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ నుంచి త్వరలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రానుందన్న మాట.  
ntr

More Telugu News