నివేదా థామస్ కాస్తంత గ్లామర్ డోస్ పెంచిందట!
Add ap7am to your home Screen

నివేదా థామస్ కాస్తంత గ్లామర్ డోస్ పెంచిందట!

తెరపై హీరో .. విలన్ తో ఒక రేంజ్ లో తలపడాలని ప్రేక్షకులు ఎలా కోరుకుంటారో, హీరోయిన్ కూడా అందంగా వుండాలని అలాగే ఆశిస్తారు. కథానాయికలు గ్లామర్ గా వుండి .. మంచి నటనను కనబరచగలిగితే ఇక వాళ్ల కెరియర్ కి తిరుగుండదు. గ్లామర్ గా కనిపించకపోతే మాత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపించదనే చెప్పాలి. అందుకేనేమో 'జై లవ కుశ'లో నివేదా థామస్ మరింత గ్లామర్ గా కనిపించడానికి ప్రయత్నించిందని అంటున్నారు.

 'జెంటిల్ మేన్' .. 'నిన్నుకోరి' సినిమాల్లో పూర్తిగా నటనకి స్కోప్ వున్న పాత్రల్లో నివేదా థామస్ కనిపించింది. ఆ పాత్రల నుంచి ఆడియన్స్ కూడా గ్లామర్ డోసును ఆశించలేదు. కానీ 'జై లవ కుశ'లో .. 'జై' పాత్రకి జోడీగా నివేదా కనిపిస్తుంది. పాత్ర పరంగా ఆమె గ్లామర్ డోస్ కాస్తంత పెంచాలి. దానికి తోడు తన కెరియర్ కి కూడా అవసరమని భావించిందో ఏమో, ఆ దిశగా ఆమె కాస్త స్పీడ్ చూపించిందనే చెప్పుకుంటున్నారు. 
ntr
niveda

More Telugu News