రజనీ '2.0' ఆడియో రిలీజ్ కి వేదిక కానున్న 'దుబాయ్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీ '2.0' ఆడియో రిలీజ్ కి వేదిక కానున్న 'దుబాయ్'

శంకర్ టేకింగ్ .. రజనీ స్టైల్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తాయనేది 'శివాజీ' సినిమా నిరూపించింది. ఇప్పుడు అదే కాంబినేషన్లో '2.0' తెరకెక్కింది. ఈ సారి ఈ కాంబినేషన్ కి అక్షయ్ కుమార్ కూడా తోడయ్యారు. దాంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతవరకూ ఫస్టులుక్ పోస్టర్స్ ను మాత్రమే వదిలిన టీమ్, త్వరలో టీజర్ తో పాటు ఆడియోను రిలీజ్ చేసే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఈ కార్యక్రమాన్ని ఇండియాలో జరపబోవడం లేదని సమాచారం. ఇందుకు 'దుబాయ్' ను వేదికగా చేయాలని ఈ ప్రాజెక్టు క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం ప్లాన్ చేస్తునట్టు చెబుతున్నారు. అక్టోబర్లో ఆడియో వేడుకను 'దుబాయ్' లో నిర్వహించాలనీ .. నవంబర్లో 'హైదరాబాద్' లో టీజర్ ను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. ఇక డిసెంబర్లో చెన్నైలో నిర్వహించే భారీ ఈవెంట్ లో ట్రైలర్ ను ఆవిష్కరించనున్నారు. 2018 ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా ఎమీ జాక్సన్ కెరియర్ కి కీలకం కానుందని చెప్పుకుంటున్నారు
rajani
akshay

More Telugu News