'జై లవ కుశ' నుంచి 'కుశ' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!
Add ap7am to your home Screen

'జై లవ కుశ' నుంచి 'కుశ' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

'జై లవ కుశ' సినిమా నుంచి టీమ్ ఒక్కో ఫస్టు లుక్ ను .. ఒక్కో టీజర్ ను వదులుతూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా నుంచి జై .. లవ పాత్రలకి సంబంధించిన ఫస్టు లుక్స్ ను .. టీజర్స్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు. రీసెంట్ గా 'కుశ' పాత్రకి సంబంధించిన ఫస్టులుక్ ను కూడా వదిలారు .. టీజర్ మాత్రం రిలీజ్ కావాల్సి వుంది.

ఈ టీజర్ ను రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాలోని మూడు పాత్రలకి సంబంధించిన పరిచయ కార్యక్రమం పూర్తవుతుంది. ఇక ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ 'శిల్పకళా వేదిక'లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. ఈ వేదికపైనే ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ట్రైలర్ తో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయమని అంటున్నారు. సెప్టెంబర్ 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  
ntr
rasi khanna

More Telugu News