mahesh babu: మహేశ్ జోడీగా ఇలియానా దాదాపు ఖరారైనట్టే!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై నాజూకు సుందరిగా .. అగ్రకథానాయికగా ఇలియానా ఒక వెలుగు వెలిగింది. తన గ్లామర్ తోను .. నటనతోను కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది. అలాంటి ఇలియానా బాలీవుడ్ పై భారీ ఆశలు పెట్టుకుని తెలుగు తెరకి దూరమైంది. మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించాలని ఉందని ఇటీవలే దర్శక నిర్మాతలకి సంకేతాలు పంపడం మొదలెట్టింది.

 ఆమె ప్రయత్నాలు ఫలించాయి .. మహేశ్ బాబు మూవీలో ఛాన్స్ కొట్టేసినట్టేననే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కొరటాలతో 'భరత్ అను నేను' సినిమా చేస్తోన్న మహేశ్, ఆ తరువాత వంశీ పైడిపల్లితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పనులు కొన్ని రోజుల క్రితమే మొదలయ్యాయి. ఈ సినిమా కోసం వంశీ పైడిపల్లి .. ఇలియానాను సంప్రదించగా వెంటనే ఆమె ఓకే చెప్పేసిందని అంటున్నారు. గతంలో మహేశ్ - ఇలియానా కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే.        
Go Back to Shorts
mahesh babu
ileana

More Telugu News