పవన్ బ్యానర్లో చేస్తోన్న సినిమా కోసం యూఎస్ కి నితిన్!
రెండవ షెడ్యూల్ ను యూఎస్ లో ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రేపటి నుంచి అక్కడ చిత్రీకరించనున్నారు. యూఎస్ నేపథ్యంలో కొనసాగే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, అక్కడ 35 రోజుల పాటు షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాకి కథను అందించినది త్రివిక్రమ్ కనుక, అందరిలోను ఆసక్తి వుంది. నితిన్ - మేఘా ఆకాశ్ కాంబినేషన్లో వచ్చిన 'లై' పరాజయం పాలైనా, ఈ సినిమాతో ఈ జంట హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.