ప్రభాస్ తో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో మురుగదాస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ తో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో మురుగదాస్!

మహేశ్ బాబుతో 'స్పైడర్' చేసిన మురుగదాస్ .. తన తదుపరి సినిమాను విజయ్ తో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. గతంలో తమిళంలో తాను హిట్ కొట్టిన సినిమాలను తెలుగులోను .. ఆ తరువాత హిందీలోను మురుగదాస్ రీమేక్ చేస్తూ వచ్చాడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో హీరోకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆయనలా రీమేక్ లు చేస్తూ వెళ్లాడు.

ఇకముందు తాను అలా చేయవలసిన పనిలేదని మురుగదాస్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకు కారకుడు ప్రభాస్ అని తెలుస్తోంది. ప్రభాస్ కి ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ వుంది. అందువలన తాను అనుకున్న కథను ఒక్కో భాషలో ఒక్కో హీరోతో చేయకుండా, ఒక్క ప్రభాస్ తో చేస్తే సరిపోతుందనే నిర్ణయానికి మురుగదాస్ వచ్చాడని అంటున్నారు. ముందుగా కమిటైన ప్రకారం ప్రభాస్ రెండు సినిమాలను వెంటవెంటనే చేయవలసి వుంది కనుక, అవి పూర్తయ్యేలోగా ప్రభాస్ కి తగిన కథను సిద్ధం చేసుకుని ఓకే చేయించేస్తాడట.  
prabhas
murugadoos

More Telugu News