'జై లవ కుశ' కోసం తమన్నా స్పెషల్ సాంగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జై లవ కుశ' కోసం తమన్నా స్పెషల్ సాంగ్!

తమన్నా ఒక వైపున స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే .. మరో వైపున స్పెషల్ సాంగ్స్ చేస్తూ వస్తోంది. 'అల్లుడు శీను' .. 'జాగ్వార్' వంటి సినిమాల్లో కొత్త కథానాయకుల కాంబినేషన్లో ఆమె స్పెషల్ సాంగ్స్ చేయడం విశేషం. అలాంటి తమన్నా  'జై లవ కుశ' సినిమాలోను స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'జై లవ కుశ' సినిమా .. షూటింగ్ పరంగా చివరిదశకు చేరుకుంది.

 ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండటంతో, తమన్నాతో చేయిస్తే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. తమన్నా ఎంత మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసిందని అంటున్నారు. ఇందుకోసం ఆమె భారీ మొత్తమే పారితోషికంగా అందుకోనుందని వినికిడి. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది. 'జనతా గ్యారేజ్' లో "పక్కాలోకల్ .. "అనే స్పెషల్ సాంగ్ మాదిరిగానే ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని యూనిట్ చెబుతోంది.      
tamannah

More Telugu News