సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  'నేనసలు డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వను' అంటోంది స్వీటీ అనుష్క. "పారితోషికం విషయంలో నా గురించి రకరకాలుగా ప్రచారం చేస్తుంటారు. నేను 'అంత' తీసుకుంటున్నాను అంటూ ఫిగర్ కూడా చెప్పేస్తుంటారు. అయితే, డబ్బుల కోసం నేను నిర్మాతలని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అసలు ఇస్తామన్న డబ్బులో చాలా మటుకు ఎగ్గొట్టిన నిర్మాతలు చాలా మంది వున్నారు. ఇది ఎవరికీ తెలియదు. డబ్బుకి నేను చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తాను" అని చెప్పింది.
*  అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. రామ్ -లక్ష్మణ్ నేతృత్వంలో ప్రస్తుతం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు.
*  అల్లరి నరేశ్ హీరోగా రూపొందిన 'మేడ మీద అబ్బాయి' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని వచ్చే నెల 8న విడుదలవుతోంది. మలయాళ దర్శకుడు ప్రజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 'జబర్దస్త్' ఫేం హైపర్ ఆది కీలక పాత్ర పోషించాడు.
*  సీనియర్ నటుడు సురేశ్ 300 చిత్రాలను పూర్తి చేశాడు. ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న 'పార్టీ' చిత్రంతో ఈ మూడు వందల మార్కును చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఈ చిత్రం షూటింగులో యూనిట్ ఆయనతో కేక్ కట్ చేయించి వేడుక జరిపింది.   
anushka

More Telugu News