ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఎన్టీఆర్ 'లవ' టీజర్!
Add ap7am to your home Screen

ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఎన్టీఆర్ 'లవ' టీజర్!

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న 'జై లవ కుశ' సినిమా నుంచి ఆల్రెడీ 'జై' పాత్రకి సంబంధించిన ఫస్టు లుక్ .. ఫస్టు టీజర్ వచ్చేశాయి. ఈ రెండూ కూడా ఎన్టీఆర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ విషయానికొస్తే వ్యూస్ పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. దాంతో ఇటీవలే 'లవ' పాత్రకి సంబంధించిన ఫస్టు లుక్ ను వదిలిన టీమ్, కొద్ది సేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేసింది.

'జై' పాత్రకి పూర్తి భిన్నంగా 'లవ' పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. 'జై' ఎంత రఫ్ లుక్ తో కనిపించాడో .. 'లవ' అంత సాఫ్ట్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు. ఆయన లుక్ .. బాడీ లాంగ్వేజ్ కొత్తగా అనిపిస్తున్నాయి. ఈ రెండు పాత్రల మధ్య  వేరియేషన్ అభిమానులల్లో మరింత ఆసక్తిని పెంచేదిలా వుంది. సెప్టెంబర్ 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.      
ntr
rashikhanna

More Telugu News