mahesh babu: 20 నిమిషాల్లోనే మహేశ్ ను ఒప్పించేశాను : మురుగదాస్

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు అభిమానులంతా 'స్పైడర్' సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'స్పైడర్' సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలను దర్శకుడు మురుగదాస్ అభిమానులతో పంచుకున్నారు. సాధారణంగా ఒక స్టార్ హీరోకు కథ చెప్పి ఒప్పించడానికి ఎక్కువ సమయమే పడుతుంది. ఆ స్టార్ హీరోను కలుసుకోవడం .. కథ చెప్పడం .. ఆయన చెప్పిన మార్పులు చేయడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేయడం వంటివి జరుగుతుంటాయి.

'స్పైడర్' విషయంలో మాత్రం అలా జరగలేదని మురుగదాస్ అన్నారు. 'శ్రీమంతుడు' తమిళ వెర్షన్ ప్రెస్ మీట్ కోసం చెన్నైకి మహేశ్ బాబు వచ్చినప్పుడు అక్కడ తాము కలుసుకోవడం జరిగిందని చెప్పారు. ఆ సమయంలో తాను మహేశ్ బాబుకి 'స్పైడర్' కథ చెప్పడం .. ఆయన వెంటనే ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అన్నారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లోనే జరిగిపోవడం విశేషమని ఆయన చెప్పారు.     
Go Back to Shorts
mahesh babu
rakul

More Telugu News