mahesh babu: ఆ ప్రచారంలో నిజం లేదు .. క్లైమాక్స్ ను మార్చనే లేదు : మురుగదాస్

షార్ట్స్‌లో చూడండి
'స్పైడర్' థియేట్రికల్ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో మురుగదాస్ బిజీగా వున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఒక పాట మాత్రమే పెండింగ్ ఉందనీ, ఈ నెల 25వ తేదీ నుంచి ఈ పాటను 'రొమేనియా'లో చిత్రీకరిస్తామని ఆయన చెప్పాడు. ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోందని అన్నాడు.

 తెలుగులో ఒక క్లైమాక్స్ .. తమిళంలో మరో క్లైమాక్స్ వుంటాయనే ప్రచారం గురించి ఆయన స్పందించాడు. అలా క్లైమాక్స్ ను మార్చే ఆలోచనే చేయలేదని ఆయన చెప్పాడు. రెండు భాషల్లోను ఒకే విధమైన క్లైమాక్స్ ఉంటుందనీ .. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని అన్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను, మలయాళ .. హిందీ .. అరబిక్ భాషల్లోకి డబ్ చేసి సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నామని స్పష్టం చేశారు.    
Go Back to Shorts
mahesh babu
rakul

More Telugu News