ఆడియో రిలీజ్ ను ప్లాన్ చేస్తోన్న 'జై లవ కుశ' టీమ్!
Add ap7am to your home Screen

ఆడియో రిలీజ్ ను ప్లాన్ చేస్తోన్న 'జై లవ కుశ' టీమ్!

'జై లవ కుశ' సినిమా చిత్రీకరణ పరంగా చివరి దశకి చేరుకుంది. ఈ సినిమా నుంచి వచ్చిన 'లవ' లుక్ ఆకట్టుకోవడంతో, టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'వినాయక చవితి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన టీజర్ ను వదలనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ గురించి కూడా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తమ ఫేవరేట్ హీరో పాటలను దేవిశ్రీ ప్రసాద్ ఏ రేంజ్ లో అదరగొట్టేశాడో తెలుసుకోవడానికి వాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. దాంతో సెప్టెంబర్ మొదటివారంలో ఆడియో వేడుక జరపడానికి ఈ సినిమా టీమ్ ఏర్పాట్లు మొదలెట్టేసింది. భారీస్థాయిలో ఆడియో వేడుక జరగనున్నట్టు తెలుస్తోంది. కథ .. కథనాలు .. ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలు .. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయని అంటున్నారు.  
ntr
rashikhanna

More Telugu News