స్టార్ హీరో మూవీలో ఛాన్స్ ను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టార్ హీరో మూవీలో ఛాన్స్ ను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి?

'ఫిదా' సినిమా సూపర్ హిట్ కావడంతో సాయిపల్లవి క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఆమెతో సినిమాలు చేయడానికి  నిర్మాతలు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం ఆమె నాని .. నాగశౌర్యల కాంబినేషన్లో చెరో సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఒకదానిలో ఆమె దెయ్యంగా కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది.

ఇక రీసెంట్ గా ఒక స్టార్ హీరో సినిమా నుంచి సాయిపల్లవికి ఆఫర్ వచ్చిందట. సాధారణంగా స్టార్ హీరోల జోడీగా చేసే ఛాన్స్ వస్తే కొత్త కథానాయికలు ఎంతమాత్రం వదులుకోరు. కానీ సాయిపల్లవి మాత్రం కారణం ఏం చెప్పిందో తెలియదు గానీ, ఆ సినిమాను రిజక్ట్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఆమె ధోరణి ఆ స్టార్ హీరోకి ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరై వుంటారబ్బా అనే ఆలోచనలో కొంతమంది పడితే .. ఫలానా హీరో కావొచ్చనే ఊహాగానాల్లో మరికొంతమంది వున్నారు.        
sai pallavi

More Telugu News